HOW TO GET YOUR SSC CERTIFICATE WHEN YOU LOST
విద్యార్థి దశలో ఎంతో
కీలకమైంది 10వ తరగతి(ఎస్. ఎస్. సీ). మనం ఎటువంటి జాబ్ కు అప్లై చేయాలన్న కావలసిన
వాటిలో ఎస్.ఎస్.సీ సర్టిఫికేట్ తప్పనిసరి. విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఈ
ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్ ను అనుకోకుండా పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులే పడాల్సి
వస్తుంది. మరి అలాంటప్పుడు ఏమి చేయాలి? తిరిగి మన ఎస్.ఎస్.సీ సర్టిఫికేట్
తెచ్చుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక సులభమైన
విధానం అమలులోకి వచ్చింది. మనం పోగొట్టుకున్న ఎస్.ఎస్.సీ సర్టిఫికేట్ ను తిరిగి
పొందాలంటే ఇప్పుడు కేవలం ఇంటర్ నెట్ ఉంటే చాలు. ఇంటర్ నెట్ ద్వారా మనం డౌన్ లోడ్
చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.
ఎస్.ఎస్.సీ సర్టిఫికేట్
తెచ్చుకోవడానికి ఈ క్రింది విధానాన్నిఅనుసరించాల్సి ఉంటుంది
మొదటగా కంప్యూటర్ నందు వెబ్ పేజీని ఓపెన్ చేసి అందులో http://memos.bseapwebdata.org .అస్ప్క్ష్ అనే లింక్ ఓపెన్
చేయాలి. ఓపెన్ అయిన తరువాత ఎస్.ఎస్.సి. బోర్డ్ కు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్
గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజ్ వస్తుంది. అందులో హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్
బర్త్, ఏ సంవత్సరం రాశారు, రెగ్యులరా? సప్లీనా? ప్రైవేటా? అని ఉంటుంది. వాటికి పూర్తి
చేసిన తరువాత కింద ఒక నెంబర్ కోడ్ ఉంటుంది. ఆ నెంబర్ ను కింద ఉన్న బాక్స్ లో టైప్
చేసి సబ్ మిట్ పైన క్లిక్ చేయాలి. వివరాలు అన్నీ కరెక్ట్ గా ఉంటే వెంటనే మీ
ఎస్.ఎస్.సి. ఒరిజినల్ సర్టిఫికేటే ప్రత్యక్షం అవుతుంది. దానిని ప్రింట్
తీసుకోవచ్చు.
గమనిక: 2004 వ సంవత్సరం
నుంచి ఆ ఫైన చదివిన వారివి మాత్రమే లభిస్తాయి